ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగార్జునపై అందమైన పోస్టల్ స్టాంప్!

Sun, Aug 28, 2016
ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగార్జున జన్మదినాన్ని పురస్కరించుకుని రేపు (ఆగస్ట్ 29) ఒక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేస్తున్నారు. 'నిర్మలా కాన్వెంట్' చిత్రం కోసం 'కొత్త కొత్త భాష...' అంటూ నాగార్జున ఈ ఏడాది సింగర్ గా కూడా మారిన నేపథ్యంలో అభిమానులతో కలసి ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ ఈ పోస్టల్ స్టాంప్ ను డిజైన్ చేయించారు.

ఇందులో పాట పాడుతున్న నాగార్జున ఫోటోతో పాటు అజరామరమైన ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ఫోటోను కూడా డిజైన్ చేశారు. నాగ్, తాజ్ మహల్... ఈ రెండూ వయసుతో సంబంధంలేని ప్రేమ చిహ్నాలు అని సింబాలిక్ గా చెప్పడమే ఈ డిజైన్ ఉద్దేశం. రేపు మధ్యాహ్నం అన్నపూర్ణా స్టూడియోలో ఈ స్టాంప్ ను విడుదల చేస్తారు. పోతే, ఈ డిజైన్ తో సుమారు పదివేల పోస్టల్ స్టాంప్స్ ను ముద్రించారు. అభిమానులు వీటిని హైదరాబాదు, అబిడ్స్ లోని జనరల్ పోస్టాఫీసు నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)