ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్' కి ఆ ఘనత దక్కింది

Sat, Aug 27, 2016
'జనతా గ్యారేజ్' ఎన్టీఆర్ - సమంతా
'జనతా గ్యారేజ్' ఎన్టీఆర్ - సమంతా
ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు అమెరికాలోను భారీస్థాయిలో విడుదలవుతున్నాయి. అయితే ఈ సినిమాలను అక్కడ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో చూసే అవకాశం లేకుండా పోతోంది. అక్కడ ఈ టెక్నాలజీని యాడ్ చేసేసరికి ఆలస్యమవుతుండటంతో సినిమాలు వెళ్లిపోతున్నాయి.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 'జనతా గ్యారేజ్' టీమ్ జాగ్రత్తపడింది. అమెరికాలో నేరుగా డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో 'జనతా గ్యారేజ్' రిలీజ్ అవుతోంది. ఈ టెక్నాలజీతో అక్కడ నేరుగా విడుదలవుతోన్న ఫస్ట్ ఇండియన్ మూవీ ఇదేనని చెబుతున్నారు. అలా 'జనతా గ్యారేజ్' ప్రత్యేకతను సంతరించుకుంది. దాదాపు అక్కడ 200 ల స్క్రీన్లపై ఈ సినిమాను ప్రదర్శించాలని భావిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)