ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వెరైటీ టైటిల్ తో రానున్న సుమంత్

Sat, Aug 27, 2016
సుమంత్
సుమంత్
కథానాయకుడిగా సుమంత్ కి గుర్తింపు లభించినా, ఆశించిన స్థాయిలో ఆయనని అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా సినిమాలకి దూరంగా వున్న ఆయన, తాజాగా ఒక సినిమా చేస్తున్నాడు. హిందీలో విజయాన్ని సాధించిన 'విక్కీ డోనర్' కి ఇది రీమేక్.

మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సుమంత్ జోడీగా పల్లవి శుభాష్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరిదశకి చేరుకుంది. దీనికి 'నరుడా .. డోనరుడా' టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని చెబుతున్నారు. త్వరలోనే టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తారట. ఈ సినిమాతోనైనా సుమంత్ కి హిట్ దొరుకుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.167.129.169
Movie News (Latest)