ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీ మూవీ చేసే ఛాన్స్ కొట్టేసినట్టే!

Sat, Aug 27, 2016
రజనీకాంత్
రజనీకాంత్
రజనీకాంత్ తో సినిమా చేయడానికి ఎంతోమంది దర్శకులు ఆసక్తి చూపుతుంటారు. ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలు అనే ఆశతో వాళ్లు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఆయన సినిమా ఒక్కటి చేస్తే అప్పుడు వచ్చే క్రేజ్ వేరు అని వాళ్లు భావిస్తుంటారు. అలాంటి దర్శకుల జాబితాలో గౌతమ్ మీనన్ కూడా కనిపిస్తున్నాడు.

అనువాద చిత్రాల ద్వారా .. స్ట్రయిట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో గౌతమ్ మీనన్ ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ధనుష్ కథానాయకుడిగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన రజనీకాంత్ తో ఒక మూవీ చేసే ఆలోచనలో వున్నాడని అంటున్నారు. అందుకు అవసరమైన కథను సిద్ధం చేసే పనిలో ఆయన బిజీగా వున్నాడని చెబుతున్నారు. మరి కథ విన్నాక రజనీ ఏమంటారో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)