ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మనవళ్లకి కూడా ఈ మూవీ చూపిస్తుందట!

Sat, Aug 27, 2016
నారా రోహిత్ .. నాగశౌర్య .. రెజీనా ప్రధానమైన పాత్రలను పోషించిన 'జ్యో అచ్యుతానంద' చిత్రం, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇద్దరు అన్నదమ్ములు .. ఒక అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథాంశంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను గురించి రెజీనా మాట్లాడుతూ, ఈ తరహా పాత్రలో నటించే ఛాన్స్ రావడం తన అదృష్టమని చెప్పింది.

డెంటల్ డాక్టర్ పాత్రలో తాను కనిపిస్తాననీ .. ఈ పాత్రలో నటించడం తనకి ఎంతో సంతృప్తిని కలిగించిందని అంది. తనకి 90 సంవత్సరాలు వచ్చినా గుర్తుండిపోయే సినిమా ఇదనీ, ఈ సినిమా తప్పకుండా చూడమని తన మనవళ్లకి .. మనవరాళ్లకి కూడా చెబుతానని అంది. అంతగా ఈ సినిమా తన మనసుకు దగ్గరైందని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలోని ఇద్దరు కథానాయకుల్లో రెజీనా ఎవరిని ప్రేమిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)