ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ కోలీవుడ్ వైపు చూస్తున్న రకుల్!

Sat, Aug 27, 2016
రకుల్
రకుల్
తెలుగులో ఎడాపెడా సినిమాలు చేసేస్తూ బిజీగా వున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్, అంతటి బిజీలోనూ ఓ తమిళ చిత్రానికి డేట్స్ ఇచ్చింది. విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో రూపొందే 'తుప్పారివాలన్' చిత్రంలో కథానాయికగా నటించడానికి ఆమె అంగీకరించింది. వాస్తవానికి తన కెరీర్ తొలినాళ్లలో తమిళంలో ఈ చిన్నది రెండు సినిమాలు చేసింది. అయితే, అవి కాస్తా ఫ్లాపవడం, అదే సమయంలో తెలుగులో హిట్స్ పడడంతో ఇక్కడ బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ తమిళం నుంచి వచ్చిన ఈ ఆఫర్ తో అక్కడ కూడా సక్సెస్ కొట్టాలని అమ్మడు భావిస్తోంది.

చాలా కాలం తర్వాత మళ్లీ తాను కోలీవుడ్ కి రావడం పట్ల రకుల్ చెబుతూ, "మొదట్లో తెలుగులో నా సినిమాలు బాగా హిట్టవడంతో అక్కడ ఆఫర్లు బాగా వచ్చి బిజీ అయిపోయాను. ఇప్పుడు తమిళంలో కూడా అలాంటి స్థితే వస్తుందని ఆశిస్తున్నాను. ఏ భాషలో చేసినా సినిమా సినిమానే! అందుకే, తమిళంలో కూడా ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను" అని చెప్పింది. 'తుపారివాలన్' సినిమాలో తన పాత్ర బాగా నచ్చిందని, అందుకే వెంటనే ఓకే చెప్పానని ఈ ముద్దుగుమ్మ అంటోంది.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)