ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

త్వరలో సెట్స్ పైకి 'పిట్ట గోడ'

Fri, Aug 26, 2016
రామ్మోహన్
రామ్మోహన్
ఆ మధ్య తెరపై ఆవిష్కరించబడిన 'ఉయ్యాలా జంపాలా' .. ఈ మధ్య తెరపై కనువిందు చేసిన 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రాలు పల్లెటూరి నేపథ్యంలో ప్రేక్షకులను అలరించాయి. ఈ రెండు సినిమాలు యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం విశేషం. ఈ సినిమాలకి ఓ నిర్మాతగాను .. స్క్రీన్ ప్లే రైటర్ గాను పి.రామ్మోహన్ వ్యవహరించారు.

ఆయన తదుపరి సినిమాకి రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాకి కూడా స్క్రీన్ ప్లే రచయితగా ఉంటూనే, నిర్మాణం విషయంలోను భాగస్వామి కానున్నారు. ఈ సినిమాకి 'పిట్టగోడ' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. అనుదీప్ దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ సినిమాలో, విశ్వదేవ్ .. పునర్నవి నాయకా నాయికలుగా అలరించనున్నారు. అక్టోబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)