ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యూఎస్ కి మళ్లీ 'శ్రీరస్తు శుభమస్తు'

Fri, Aug 26, 2016
'శ్రీరస్తు శుభమస్తు'లో అల్లు శిరీష్ - లావణ్య త్రిపాఠి
'శ్రీరస్తు శుభమస్తు'లో అల్లు శిరీష్ - లావణ్య త్రిపాఠి
అల్లు శిరీష్ .. లావణ్య త్రిపాఠి జంటగా నటించిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం, తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వసూళ్ల విషయంలోనూ ఈ సినిమా శిరీష్ కి ఆనందాన్ని కలిగించింది. అయితే అల్లు శిరీష్ గతంలో చేసిన రెండు సినిమాలు ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడం వలన, యూఎస్ లో ఈ సినిమాకి ఆశించినస్థాయి గుర్తింపు లభించలేదు.

ఈ సినిమా గురించి అక్కడి వాళ్లకి తెలియడానికి కొంత సమయం పట్టింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను మరోసారి అక్కడ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. వారం రోజుల పాటు యూఎస్ లోని తెలుగువాళ్ల ముందుకు వచ్చే మరో కొత్త సినిమా కూడా ఏదీ లేదు. ఇది కూడా కలిసొచ్చే అంశం కావడం వలన, అక్కడ 22 సెంటర్లలో ఈ వారం ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)