ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పట్టాలెక్కిన సునీల్ సినిమా

Fri, Aug 26, 2016
సునీల్ హీరోగా ఎన్.శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలవుతుందనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన పాటల రికార్డింగ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ - ప్రసాద్ ల్యాబ్స్ లో మొదలైంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా సాంగ్స్ రికార్డింగ్ ఆరంభమైంది. టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ స్క్రిప్ట్ ను అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ, మలయాళంలో ఘన విజయాన్ని అందుకున్న 'టు కంట్రీస్' చిత్రానికి ఇది రీమేక్ అని చెప్పాడు. ఇది సునీల్ మాత్రమే చేయగల సినిమా అని అన్నాడు. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగును ఆరంభించి, డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పాడు. హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 30 శాతం షూటింగ్ జరుపుతామనీ, మిగతా 70 శాతం చిత్రీకరణ అమెరికాలో జరుపుతామని తెలిపారు.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)