ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ వస్తోంది!

Fri, Aug 26, 2016
అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'త్రీ ఇడియట్స్' హిందీ చిత్రం అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది. కాలేజీ కుర్రాళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలనూ ఆకట్టుకుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దీనికి సీక్వెల్ ను రూపొందించే ఆలోచన చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు రాజ్ కుమార్ వెల్లడించారు.

"దీనికి సీక్వెల్ చేసే ఆలోచన వుంది. ఇటీవల రచయిత అభిజిత్ తో కలసి కథకు సంబంధించి ఓ పాయింట్ అనుకున్నాం. ఆ లైన్ ను అమీర్ కు కూడా చెప్పాను. అతనికి కూడా నచ్చింది, తప్పకుండా చేద్దాం అన్నాడు. అమీర్ లాంటి హీరోతో పనిచేయడం హాయిగా వుంటుంది. తన పాత్ర పోషణ విషయంలో బెస్ట్ రిజల్ట్ కోసం నూరు శాతం కష్టపడే నటుడు తను" అని చెప్పాడు. కాగా, 'త్రీ ఇడియట్స్'లో కథ ముగ్గురు కాలేజ్ కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు చేయనున్న సీక్వెల్ లో ముగ్గురు నడి వయసు వ్యక్తుల మధ్య తిరిగేలా కథను ప్లాన్ చేస్తున్నారట.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)