ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ ని ప్రశంసించిన మురుగదాస్

Fri, Aug 26, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
మహేశ్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాను గురించి ఓ తమిళ పత్రికతో మురుగదాస్ మాట్లాడుతూ, మహేశ్ గురించి ప్రస్తావించాడు.

ఒక సన్నివేశాన్ని గురించి చెబుతున్నప్పుడు మహేశ్ ఎంతో శ్రద్ధ పెట్టి వింటారని మురుగదాస్ చెప్పాడు. ఆ సీన్ చేశాక ఆయన తన వైపు చూస్తారనీ, తనలో ఏ మాత్రం అసంతృప్తి కనిపించినా ఆయనే నెక్స్ట్ టేక్ కి వెళదామని చెబుతాడని అన్నాడు. మహేశ్ గొప్పనటుడనీ .. ఆయన అంకితభావాన్ని ఈ సినిమా కారణంగా తాను చూడగలిగానని చెప్పాడు. సెట్లో కూడా 'ప్రిన్స్' పేరుకి తగినట్టుగానే ఆయన హుందాగా నడచుకుంటారంటూ ప్రశంసించాడు.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)