ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బాహుబలి 2'లో ఆ సీన్ కోసం నాలుగు వెర్షన్లు!

Fri, Aug 26, 2016
ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన 'బాహుబలి' చిత్రం చూసిన వాళ్లకి ఓ ప్రశ్న సస్పెన్స్ గా మిగిలిపోతుంది. తాను ఎంతో ప్రేమించిన బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాల్సి వచ్చింది? అన్నదే ఆ ప్రశ్న. దీనిపై ఎంతో చర్చ జరుగుతోంది. కానీ, దీనికి సమాధానం మాత్రం దొరకడం లేదు. దర్శకుడు రాజమౌళిని అడిగినా "బాహుబలి 2 చూస్తే దానికి సమాధానం తెలుస్తుంది" అంటూ ఎప్పటికప్పుడు ఆయన సమాధానాన్ని దాటవేస్తున్నారు. ఇప్పుడు ఇక సమయం వచ్చింది. ఈ సినిమా సీక్వెల్ చిత్రీకరణ ముగింపుకు వచ్చింది.

దీంతో ఆ ప్రశ్నకు సమాధానమైన కీలక సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. అయితే, దీనికి సంబంధించి నాలుగు వెర్షన్లను దర్శకుడు షూట్ చేస్తున్నాడట. దీనిపై చిత్రం యూనిట్ వర్గాలు చెబుతూ "వాస్తవానికి బాహుబలి రిలీజ్ అయినప్పుడు ఈ ప్రశ్నకు రాజమౌళి వద్ద కూడా సమాధానం లేదు. దాంతో ఇప్పుడు దానికి వివరణ ఇస్తూ నాలుగు వెర్షన్లను చిత్రీకరిస్తున్నారు. సినిమా విడుదలకు ముందు బాగా కన్విన్సింగ్ గా వుండే ఒక వెర్షన్ ను ఫైనల్ చేసి దానిని ఉంచుతారు" అంటున్నాయి. సో, ఈ సస్పెన్స్ మరికొన్నాళ్ల పాటు కొనసాగుతుందన్న మాట!
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)