ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Fri, Aug 26, 2016
రెజీనా
రెజీనా
* అమితాబ్ బచ్చన్ తో కలసి నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా వుందంటోంది అందాలతార రెజీనా. అమితాబ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ సినిమా 'ఆంఖేన్'లో ఈ చిన్నది కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. దాని గురించే చెబుతూ, "అమితాబ్ పెద్ద స్టార్ కదా, సెట్లో వాతావరణం ఎలా వుంటుందో అని భయపడ్డాను. అయితే, ఆయన ఎంతో సరదాగా వుంటారు. సెట్లో ఆయనే నన్ను అందరికీ 'మన హీరోయిన్' అంటూ పరిచయం చేశారు. ఆయనతో నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా, కంఫర్ట్ గా వుంది" అని చెప్పింది రెజీనా.
* రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హైపర్' చిత్రం విశాఖ షెడ్యూలు పూర్తయింది. ఆ వెంటనే నిన్నటి నుంచి హైదరాబాదులో తదుపరి షూటింగును నిర్వహిస్తున్నారు. ఇందులో రామ్ సరసన రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తోంది.
* ప్రస్తుతం తాను హీరోగానే నటించాలని అనుకోవడం లేదని, మంచి పాత్రలు ఏవి వచ్చినా చేస్తానని నందమూరి తారకరత్న చెప్పాడు. ఆయన తాజాగా నటించిన 'ఎవరు' చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చెబుతూ, హీరో పాత్రలే వేయాలని తాను గిరి గీసుకుని కూర్చోలేదని చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)