ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బోయపాటితోనే చిరూ 151వ మూవీ?

Thu, Aug 25, 2016
చిరంజీవి
చిరంజీవి
ఒక వైపున వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమాగా, 'ఖైదీ నెంబర్ 150' తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణ జరుపుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి 151వ సినిమాను గురించిన వార్తలు ఫిల్మ్ నగర్లో జోరందుకున్నాయి. చిరంజీవి 151వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు త్వరలో మొదలుకానున్నాయని చెబుతున్నారు.

ఈ సినిమాను తాము నిర్మించనున్నట్టు గతంలోనే గీతా ఆర్ట్స్ వారు చెప్పారు. ఇక ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే అవకాశం ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు. 'సరైనోడు' ద్వారా గీతా ఆర్ట్స్ వారికి బోయపాటి సూపర్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమా విషయంలోనే బోయపాటిని చిరూ తెగ మెచ్చేసుకున్నారు. అందువలన ఆయనే దర్శకుడని చెప్పేసుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)