ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Thu, Aug 25, 2016
కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్
* 'జనతా గ్యారేజ్'లో తాను చేసిన 'పక్కా లోకల్...' స్పెషల్ సాంగ్ తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. ఈ ఎనర్జిటిక్ నెంబర్ లో తారక్ తో కలసి డ్యాన్స్ చేయడం ఉత్సాహాన్నిచ్చిందని చెప్పింది. ఈ సినిమా కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని ఈ ముద్దుగుమ్మ చెప్పింది.
* అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జ్యో అచ్యుతానంద' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. చిత్రాన్ని వచ్చే నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఇందులో నారా రోహిత్, నాగశౌర్య హీరోలుగా, రెజీనా హీరోయిన్ గా నటించారు.
* సాయిరాం శంకర్, నికీషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అరకు రోడ్ లో' చిత్రం సాంగ్ టీజర్ ను నిన్న హీరో ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, 'ఎప్పుడురా పెళ్లి....' అంటూ సాగే ఈ పాట తన గురించే రాసినట్టుందని చమత్కరించాడు.
* హాస్య నటుడు ధనరాజ్ హీరోగా దీక్షాపంత్ కథానాయికగా నటించిన 'బంతిపూల జానకి' చిత్రాన్ని రేపు (ఆగస్టు 26) విడుదల చేస్తున్నారు. దీనికి నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వం వహించాడు.
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)