ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ధ్రువ' రిలీజ్ డేట్ ఖరారైంది

Wed, Aug 24, 2016
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 7వ తేదీన విడుదల చేయనున్నట్టుగా వార్తలు వినిపించాయి. అదే తేదీని ఖరారు చేస్తున్నట్టుగా తాజాగా నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనుకున్న ప్రకారం షూటింగ్ జరిగిపోతోందని అన్నారు. చరణ్ పాత్ర .. ఆయన కొత్త లుక్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటాయని చెప్పారు. అరవింద్ స్వామి పాత్ర ఈ సినిమాకి హైలైట్ అవుతుందని అన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి ఈ సినిమా టాకీ పార్టీ పూర్తవుతుందనీ, అదే నెలలో పాటల చిత్రీకరణ కూడా ఫినిష్ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని అన్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)