ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బాషా'మళ్లీ వస్తున్నాడు!

Wed, Aug 24, 2016
రజనీకాంత్
రజనీకాంత్
రజనీకాంత్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'బాషా' ఒకటి. ఆ తరువాత కాలంలో మాఫియా నేపథ్యంలో ఎన్నో సినిమాలు రావడానికి ఈ సినిమా దోహదం చేసింది. విడుదలైన ప్రతిచోటా ప్రభంజనాన్ని సృష్టిస్తూ, రజనీకాంత్ క్రేజ్ ను ఎవరెస్టు స్థాయికి తీసుకెళ్లింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ రానున్నట్టుగా ఆ మధ్య వార్తలు షికారు చేశాయి.

అయితే ఇప్పుడు అదే సినిమాను డిజిటల్ వెర్షన్ లో అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రజనీకాంత్ పుట్టినరోజైన డిసెంబర్ 12న 'బాషా' సినిమా డిజిటల్ వెర్షన్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన పనులను కె.ఎస్. రవికుమార్ దగ్గరుండి చూసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. 'కబాలి' తరువాత రానున్న ఈ సినిమా భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)