ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ సీన్ గురించి తమన్నా ఇలా చెప్పింది!

Wed, Aug 24, 2016
తమన్నా
తమన్నా
'బాహుబలి' సినిమా జాతీయస్థాయిలో తమన్నాకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ''పచ్చ బొట్టేసిన .. '' పాటలో తమన్నా గ్లామర్ కుర్రకారు మనసులను కట్టిపడేసింది. అయితే అదే పాట చిత్రీకరణ పరంగా ఆమెకి కొన్ని విమర్శలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మలచిన తీరుపట్ల, ప్రముఖ మహిళా జర్నలిస్ట్ 'అన్నా వెట్టికాడ్' విమర్శలను గుప్పించింది.

తాజాగా ఆ విమర్శల పట్ల తమన్నా స్పందించింది. ''పచ్చబొట్టేసిన ..'' పాటలో తాను కథానాయకుడి ఎదురుగా సెమీ న్యూడ్ గా నించున్నాననే విషయం అవాస్తవమని చెప్పింది. ఆ పాటలో భాగంగా తాను కథానాయకుడి ముందు సెమీ న్యూడ్ గా నించోలేదని అంది. సినిమా టిక్ గా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారనీ .. అందువలన అది అలాంటి భ్రాంతిని కలిగించిందని చెప్పుకొచ్చింది. ఇక రెండవ భాగంలో తాను గుర్రపు స్వారీ చేస్తూ .. కత్తి యుద్ధంలో పాల్గొంటూ ఒక యోధురాలిగా కనిపిస్తానని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)