ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ హీరోగా 'మెగా ఎక్స్ ప్రెస్'

Wed, Aug 24, 2016
చరణ్
చరణ్
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయనున్నాడనే వార్త కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమాకి 'మెగా ఎక్స్ ప్రెస్' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' .. 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమాలు ఘనవిజయాలను అందుకున్నాయి.

దాంతో అదే సెంటిమెంట్ తో ఆయన చరణ్ తో చేయనున్న సినిమాకు 'మెగా ఎక్స్ ప్రెస్' టైటిల్ ను పెట్టాలనే ఆలోచనలో వున్నట్టుగా చెబుతున్నారు. స్టోరీ లైన్ ఓకే అనిపించుకున్న మేర్లపాక గాంధీ, ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నాడట. ప్రస్తుతం 'ధ్రువ' సినిమా షూటింగులో వున్న చరణ్, ఆ తరువాత సుకుమార్ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా షూటింగ్ మొదలుపెట్టాక, మేర్లపాక గాంధీతో చేసే సినిమాను ఎనౌన్స్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)