ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఖైదీ నంబర్ 150'తో రాజమౌళి తనయుడు!

Wed, Aug 24, 2016
కార్తికేయ
కార్తికేయ
చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నంబర్ 150' చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ టీజర్ ను కట్ చేసింది ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ అన్న పేరు బయటకు రావడంతో దీనికి మరింత క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషనల్ యాక్టివిటీస్ బాధ్యతను కార్తికేయకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్ ను డైరెక్ట్ చేసే బాధ్యతను అతనికి రామ్ చరణ్ అప్పగించినట్టు చెబుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న చిత్రం కాబట్టి మేకింగ్ వీడియోస్ చాలా స్టయిలిష్ గా ... నేటి ట్రెండుకి తగ్గట్టుగా ఉండేలా తయారుచేసే ప్రణాళికను కార్తికేయ రూపొందిస్తున్నాడట. దీంతో ప్రస్తుతం కార్తికేయ ఆ పనిలో పడ్డాడు. కాగా, 'షోయింగ్ బిజినెస్' పేరిట ఈ కుర్రాడు ఓ కంపెనీని నెలకొల్పి గత కొన్నాళ్లుగా ప్రమోషనల్ వీడియోస్ ను రూపొందిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)