ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మెగా అభిమానులకు వర్మ క్షమాపణలు!

Tue, Aug 23, 2016
రాంగోపాల్ వర్మ ఏదైనా అంటాడు, ఏదైనా చేస్తాడు. దేనికీ సిగ్గుపడడు, భయపడడు. తన వ్యాఖ్యలు కాంట్రావర్శీ అవుతాయని తెలిసి కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. అయితే, అలా అనడంలో తన తప్పుందని గ్రహిస్తే కనుక తర్వాత సారీ చెప్పడానికి కూడా సంశయించడు. ఇప్పుడలాగే మెగాస్టార్ అభిమానులకి క్షమాపణలు చెప్పాడు. చిరంజీవి నటిస్తున్న 150వ సినిమా టైటిల్ 'ఖైదీ నెం.150' ఏమీ బాగోలేదంటూ వర్మ ఇటీవల కామెంట్ చేశాడు. దీనిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఆయనపై దుమ్మెత్తిపోశారు.

అయితే, ఇప్పుడు చిరంజీవి ఫస్ట్ లుక్ చూశాక వర్మ తన మనసు మార్చుకున్నాడు. మెగా ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పాడు. "ఈ ఫస్ట్ లుక్ చూశాక గతంలో నేను చేసిన విమర్శలకు మెగా ఫ్యాన్స్ కు అపాలజీ చెబుతున్నాను. అసలు మెగాస్టార్ కెరీర్లోనే ఇది బెస్ట్ లుక్. సూపర్ గా వుంది... రాకింగ్..." అంటూ వర్మ తాజాగా ట్వీట్ చేస్తూ చిరంజీవి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా పోస్ట్ చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.211.11.50
Movie News (Latest)