ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఖైదీ నెం.150'లో మెగాస్టార్ బ్రాండ్ డైలాగు!

Tue, Aug 23, 2016
చిరంజీవి
చిరంజీవి
మాస్ హీరోలకు పక్కా మాస్ డైలాగులు వుండాలి. అప్పుడే థియేటర్లో క్లాప్స్ పడతాయి. అందులోనూ చిరంజీవి లాంటి పక్కా మాస్ హీరోకి మరీనూ. ఆయన హీరోయిజాన్ని హైలైట్ చేసే డైలాగులు వుండాలి. అందుకే, ఆయా రచయితలు అలాంటి డైలాగులు రాయడానికి గట్టిగా కృషి చేస్తారు. తాజాగా మెగాస్టార్ నటిస్తున్న 'ఖైదీ నెం.150' సినిమాలో కూడా ఈ తరహా పవర్ ఫుల్ డైలాగులు వున్నాయట. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ నిన్న రాత్రి జరిగిన చిరంజీవి బర్త్ డే వేడుకలో చెప్పారు.

"చిరంజీవి గారి నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో అవన్నీ ఇందులో వున్నాయి. ఇక డైలాగులు అయితే చెప్పేక్కర్లేదు. మచ్చుకి ఓ డైలాగు చెబుతాను. 'పొగరు నా ఒంట్లో వుంటుంది... హీరోయిజం నా ఇంట్లో వుంటుంది' అంటారు ఓ సీన్లో. ఇలాంటి పవర్ ఫుల్ డైలాగులు సినిమాలో ఎన్నో వున్నాయి" అని చెప్పాడు వినాయక్. దీంతో అభిమానులు పెద్ద పెట్టున క్లాప్స్ కొడుతూ, ఈలలు వేస్తూ హర్షధ్వానాలు చేశారు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)