ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంపత్ నంది మూవీ మొదలైంది

Mon, Aug 22, 2016
గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమా ఈ రోజున పూజా కార్యక్రమాలు జరుపుకుంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.

హీరో గోపీచంద్ క్లాప్ కొట్టగా .. శరత్ మరార్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా .. సుధాకర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన హన్సిక .. కేథరిన్ కథానాయికలుగా నటించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు భగవాన్ - పుల్లారావు మాట్లాడుతూ, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని అన్నారు. భారీ బడ్జెట్ తోను .. అత్యున్నత సాంకేతిక విలువలతోను రూపొందుతోన్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించనున్నట్టు చెప్పారు.
X

Feedback Form

Your IP address: 54.211.11.50
Movie News (Latest)