ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నిజంగానే మందుకొట్టి నటించాడట!

Mon, Aug 22, 2016
విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోని
సాధారణంగా కొన్ని సినిమాల్లో మద్యం సేవించే సన్నివేశాలు .. పాటలు ఉంటూనే ఉంటాయి. అలాంటప్పుడు ఏ నటుడైనా మద్యం సేవించినట్టుగా నటిస్తాడేగానీ .. మద్యం సేవించడు. కానీ తాను మాత్రం తాగుబోతుగా కనిపించే సన్నివేశం కోసం నిజంగానే తాగేశానని 'బిచ్చగాడు' ఫేం విజయ్ ఆంటోని అన్నాడు.

తాజాగా తాను సంగీతాన్ని అందించిన ఒక తమిళ సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పాడు. ఈ సినిమాలో తాగుబోతుగా ఒక పాటలో సంతానం చాలా సహజంగా నటించాడని విజయ్ ఆంటోని చెప్పాడు. గతంలో తాను 'సలీం' సినిమాలో ఈ తరహా పాటలో నటించవలసి వచ్చినప్పుడు, సహజత్వం కోసం నిజంగానే తాగేసి నటించానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)