ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విష్ణు జోడీగా మరో ఛాన్స్ కొట్టేసిన హన్సిక

Mon, Aug 22, 2016
హన్సిక
హన్సిక
విష్ణు కథానాయకుడిగా రాజ్ కిరణ్ దర్శకత్వంలో, ఒక కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతకాలంగా అన్వేషణ కొనసాగుతూ వచ్చింది. చివరికి కథానాయికగా హన్సికను ఖరారు చేసుకున్నారు.

గతంలో విష్ణు - హన్సిక కాంబినేషన్లో వచ్చిన 'దేనికైనా రెడీ' సినిమా, ఘన విజయాన్ని అందుకుంది. దాంతో ఆమెనే కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. 'పవర్' సినిమా తరువాత తెలుగులో కథానాయికగా హన్సిక నటించలేదు. వరుస సినిమాలతో తమిళంలో ఆమె చాలా బిజీగా వుంది. అందువలన కొంత గ్యాప్ తరువాత తెలుగులో ఆమె ఈ సినిమాను అంగీకరించింది. హన్సిక అభిమానులకి ఇది ఆనందాన్ని కలిగించే విషయమే.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)