ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Mon, Aug 22, 2016
ఇలియానా
ఇలియానా
* గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు మంచి హ్యాపీ మూడ్ లో వుంది. తాను ఎంతగానో ఎదురుచూస్తున్న హిట్టు 'రుస్తుం' సినిమా రూపంలో అమ్మడికి లభించింది. అక్షయ్ కుమార్ తో కలసి ఇల్లీ బ్యూటీ నటించిన ఈ 'రుస్తుం' హిందీ చిత్రం మంచి హిట్ సినిమాగా పేరు తెచ్చుకుని, కలెక్షన్ల పరంగా 100 కోట్ల క్లబ్బులో చేరింది.
* అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జ్యో అచ్యుతానంద' చిత్రం ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. ఆడియోతో పాటు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. నారా రోహిత్, నాగశౌర్య ఇందులో హీరోలుగా నటిస్తున్నారు.
* తరుణ్, ఓవియా జంటగా రమేశ్ గోపి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇది నా లవ్ స్టోరీ' చిత్రం పాటల చిత్రీకరణ ఇటీవల లే లడక్, కులుమనాలి ప్రాంతాలలో జరిగింది. ఇక ఒక పాట మాత్రం మిగిలివుందని నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోందని చెప్పారు.
* వరుణ్ సందేశ్ నటిస్తున్న 'మిస్టర్ 420' ప్రేమకథా చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. ఎస్.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాటల వేడుకను ఈ నెల 27న నిర్వహిస్తారు. ఇందులో ప్రియాంక భరద్వాజ్ కథానాయికగా నటిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)