ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మలయాళం సినిమాలో అమల అక్కినేని

Sun, Aug 21, 2016
అమల అక్కినేని
అమల అక్కినేని
ఆమధ్య శేఖర్ కమ్ముల రూపొందించిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాలో నటించిన అమల అక్కినేని, ఇప్పుడు ఓ మలయాళ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత తిరిగి ఇప్పుడు మలయాళ సినిమాకు వస్తోంది. 1991లో మోహన్ లాల్ హీరోగా నటించిన 'ఉల్లడక్కం' అనే సినిమాలో అమల కథానాయికగా నటించింది. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు 'కేరాఫ్ సైరాభాను' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె లాయర్ గా నటిస్తోందని, ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చిత్రం యూనిట్ చెబుతోంది. ఈ పాత్ర నచ్చడం వల్లే ఆమె ఒప్పుకుందని అంటున్నారు. నూతన దర్శకుడు ఆంథోనీ సోనీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో మంజు వారియర్ కథానాయికగా సైరాబాను పాత్రలో కనిపిస్తుంది.
X

Feedback Form

Your IP address: 54.211.11.50
Movie News (Latest)