ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గోపీచంద్-సంపత్ సినిమా రేపే ప్రారంభం

Sun, Aug 21, 2016
సంపత్
సంపత్
ప్రస్తుతం 'ఆక్సిజన్' చిత్రాన్ని చేస్తున్న యాక్షన్ హీరో గోపీచంద్ తన తదుపరి చిత్రాన్ని సంపత్ నందితో చేస్తున్నాడు. గత ఏడాది రవితేజతో 'బెంగాల్ టైగర్' చిత్రం చేసిన సంపత్ చేస్తున్న తదుపరి చిత్రం ఇదే. ఈ చిత్రం షూటింగును రేపు ఉదయం లాంఛనంగా హైదరాబాదులో ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
"గోపీచంద్ గారితో చేసే చిత్రం పూజాకార్యక్రమాలను రేపు ఉదయం 11.22 గంటలకు ఫిలిం నగర్ దేవాలయంలో నిర్వహిస్తున్నాం. శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై భగవాన్ గారు, పుల్లారావుగారు దీనిని నిర్మిస్తున్నారు" అంటూ సంపత్ ట్వీట్ చేశాడు. ఇదిలావుంచితే, గోపీచంద్ నటిస్తున్న 'ఆక్సిజన్' చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)