ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిరూ కష్టం చూసి చరణ్ కి కన్నీళ్లు!

Sun, Aug 21, 2016
చరణ్
చరణ్
చిరంజీవి పుట్టినరోజు రేపే కావడంతో, ఆ వేడుకకి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఈ పుట్టినరోజున తండ్రికి ఒక మంచి పెయింటింగ్ ను చరణ్ గిఫ్టుగా ఇవ్వనున్నాడట. ఆ పెయింటింగ్ ఇంకా తండ్రికి చూపించలేదని చెప్పాడు. ఈ సందర్భంలోనే ఆయన తన తండ్రి అంకితభావాన్ని తలచుకున్నాడు.

'ఠాగూర్' సినిమాలో ''కొడితే కొట్టాలిరా .. '' అనే పాట చిత్రీకరణ జరుగుతుండగా మోకాలు దగ్గర సౌండ్ వచ్చి చిరంజీవి చాలా బాధపడ్డారట. అయినా ఐస్ పెట్టుకుంటూ ఆయన ఆ పాటను పూర్తిచేశారు. ఆ సమయంలో ఆయన బాధను చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నాననీ .. ఆ తరువాత ఆ మోకాలుకి ఆపరేషన్ జరిగిందని చరణ్ గుర్తుచేసుకున్నాడు. ఆయనని చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉందనీ .. తన తండ్రే తన రియల్ హీరో అని చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)