ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదంతా పుకారేనన్న తమన్నా

Sun, Aug 21, 2016
తమన్నా
తమన్నా
తెలుగు .. తమిళ సినిమాలతో బిజీగా వున్న తమన్నా, హిందీలోను సరైన హిట్ కొట్టాలనే ఆలోచనలో వుంది. ఆ దిశగా ఆమె తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే వుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆమె ఓ మలయాళ సినిమా కూడా చేయబోతున్నట్టు రెండు మూడు రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

ఈ ప్రచారం ఎక్కువవుతూ ఉండటంతో తమన్నా స్పందించింది. తాను మలయాళ సినిమాను అంగీకరించినట్టుగా వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆమె చెప్పింది. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని అంది. తాను కొత్తగా ఏదైనా సినిమాను ఒప్పుకుంటే ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తానని, అందువలన పుకార్లను నమ్మవద్దని తేల్చి చెప్పింది.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)