ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శిల్పకళా వేదికలో చిరూ ఫస్టు టీజర్

Sat, Aug 20, 2016
చిరంజీవి
చిరంజీవి
చిరంజీవి పుట్టినరోజైన ఈ నెల 22వ తేదీన, ఆయన 150వ సినిమా నుంచి ఫస్టు లుక్ వస్తుందని చెప్పారు. ఆ రోజున ఫస్టు టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నారనేది తాజా సమాచారం. చిరంజీవి 150వ సినిమా కావడం వలన .. కొంత గ్యాప్ తరువాత ఆయన చేస్తోన్న సినిమా కావడం వలన ఈ సినిమా మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

అందువలన ఈ సినిమా ఫస్టులుక్ ను .. ఫస్టు టీజర్ ను ఆ రోజున హైదరాబాద్ - శిల్పకళా వేదికలో అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నారు. ఫ్యాన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ను ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతోనే భారీ ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ సినిమా టైటిల్ ఏమిటో తెలుసుకోవడం కోసం .. చిరూ లుక్ ఎలా ఉంటుందో చూడటం కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)