ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాధిక ఆప్టే మూవీ అక్కడివారి కోసమేనట!

Sat, Aug 20, 2016
రాధిక ఆప్టే
రాధిక ఆప్టే
'పార్ష్ డ్' అనే సినిమాలో రాధికా ఆప్టే అర్థనగ్నంగా నటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇంటర్ నెట్ లో వైరల్ అవుతోన్న ఆ సన్నివేశాలను చూసిన నెటిజన్లు ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. అజయదేవగణ్ - అసీమ్ బజాజ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, లీనా యాదవ్ తెరకెక్కించింది.

ఈ సినిమాను మనదేశంలో విడుదల చేసే ఉద్దేశం దర్శక నిర్మాతలకి లేదుట. అందువలన ఈ సినిమా షూటింగ్ జరుగుతోన్న విషయాన్ని కూడా వాళ్లు బయటికి రానీయలేదు. ఇతర దేశాల్లో ఈ తరహా సన్నివేశాలు ఉండటం సహజం కనుక, అక్కడి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను తెరకెక్కించామనేది దర్శక నిర్మాతల మాట. ఈ సినిమా విదేశాల్లో పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. అక్కడి నుంచే ఈ సినిమాలోని సన్నివేశాలు లీకై .. హాట్ టాపిక్ కి తెరతీశాయని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)