ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లవ్ స్టోరీస్ పై దృష్టి పెట్టిన చరణ్

Sat, Aug 20, 2016
చరణ్
చరణ్
'ఆరెంజ్' సినిమా తరువాత చరణ్ పెద్దగా లవ్ స్టోరీస్ చేయలేదు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఓ రెండు లవ్ స్టోరీస్ చేస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నాడట. ఆ తరహా కథలు సిద్ధం చేయమని ఇద్దరు దర్శకులకు పురమాయించాడట కూడా.

వాళ్లలో మేర్లపాక గాంధీ ఒక లైన్ రెడీ చేసి చరణ్ కి వినిపించాడు. లైన్ అదిరిందని చరణ్ చెప్పడంతో, పూర్తి స్క్రిప్ట్ ను తయారు చేసే పనిలో పడ్డాడని చెబుతున్నారు. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించేదిగా ఈ కథ వుంటుందని అంటున్నారు. త్వరలో ఈ సినిమాను గురించి ఎనౌన్స్ చేసి, సుకుమార్ సినిమా పూర్తయిన తరువాత సెట్స్ పైకి వెళతారట.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)