ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ మూవీలో మళ్లీ బన్నీ?

Sat, Aug 20, 2016
అల్లు అర్జున్
అల్లు అర్జున్
చరణ్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' చిత్రం రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా, షూటింగు దశలో వుంది. ఈ సినిమా గురించిన టాక్ ఒకటి ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది. 'ధ్రువ'లో అల్లు అర్జున్ గెస్టు రోల్ చేయనున్నాడని చెబుతున్నారు.

ఇది చరణ్ సినిమా కావడం వలన .. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతుండటం వలన .. దర్శకుడు సురేందర్ రెడ్డి తనకి 'రేసు గుర్రం'తో హిట్ ఇచ్చిన కారణంగా బన్నీ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడని అంటున్నారు. గతంలో చరణ్ హీరోగా చేసిన 'ఎవడు' లోను బన్నీ ఒక ముఖ్యమైన పాత్రను చేశాడు. ఆ సినిమాతో మెగా అభిమానులను మెప్పించిన ఈ ఇద్దరూ, మరోసారి తెరపై కనిపించనున్నారన్న మాట.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)