ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మలయాళ సినిమాకు ఓకే చెప్పిన తమన్నా

Sat, Aug 20, 2016
తమన్నా
తమన్నా
తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలలో నటిస్తున్న మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా, తొలిసారిగా ఓ మలయాళ సినిమాలో నటించనుంది. రతీష్ అంభట్ దర్శకత్వంలో 'కుమారసంభవం' అనే మలయాళ చిత్రం రూపొందుతోంది. ఇందులో హీరో సిద్ధార్థ్ (ఇతనికి కూడా తొలి మలయాళ చిత్రమిది) ఒక కథానాయకుడిగా నటిస్తుండగా, మరో హీరోగా మలయాళ నటుడు దిలీప్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు గాను తమన్నాను అడగడంతో ఆమె అంగీకరించిందని సమాచారం. ఇందులో సిద్ధార్థ్, దిలీప్ పాత్రలకు సమ ప్రాధాన్యత ఉంటుందట. వీరి సరసన కథానాయిక పాత్రకు తాజాగా తమన్నాని ఎంచుకున్నారు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)