ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ మూవీ కోసం ఆయన్ని తీసుకున్నారట!

Sat, Aug 20, 2016
చరణ్ తాజా చిత్రంగా 'ధ్రువ' తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే షూటింగును పూర్తిచేసుకోనుంది. దాంతో చరణ్ నెక్స్ట్ మూవీకి చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. చరణ్ తన తదుపరి సినిమాను సుకుమార్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ను సుకుమార్ సిద్ధం చేశాడు.

తాజాగా సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంసను ఎంపిక చేసుకున్నారు. గతంలో ఆయన 'ఏ మాయ చేసావే' .. 'రేసుగుర్రం' సినిమాలకి పనిచేశాడు. ఈ రెండు సినిమాల విజయంలో ఆయన కీలకమైన పాత్రను పోషించాడు. అందువలన ఆయనని ఈ సినిమాకి తీసుకున్నారు. ఈ సినిమాకి ఆయన తప్పకుండా ప్లస్ అవుతాడని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. నవంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)