ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఏసుదాసుతో పాడించిన ఆర్పీ పట్నాయక్

Sat, Aug 20, 2016
ఏసుదాసు - ఆర్పీ పట్నాయక్
ఏసుదాసు - ఆర్పీ పట్నాయక్
సంగీత దర్శకుడిగా .. దర్శకుడిగా .. నటుడిగా ఆర్పీ పట్నాయక్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన తెరకెక్కించిన 'మనలో ఒకడు' సినిమా ఆడియో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాలోని ఒక పాటను ఆయన ఇటీవల ఏసుదాసుతో పాడించాడు. చాలా కాలం తరువాత తెలుగులో ఏసుదాసు పాడిన ఈ పాట, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అన్నాడు.

ఈ నెల 27న ఈ సినిమా ఆడియోను విడుదల చేయనున్నట్టు చెప్పాడు. కృష్ణమూర్తి అనే ఒక సాధారణమైన లెక్చరర్ చుట్టూ కథ తిరుగుతుందని అన్నాడు. ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగిందని చెప్పాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)