ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాక్సాఫీసు దగ్గర బ్రదర్స్ పోటీ!

Sat, Aug 20, 2016
కోలీవుడ్ అగ్రకథానాయకులుగా సూర్య .. కార్తీ ఇద్దరికీ కూడా ఎంతో క్రేజ్ వుంది. తెలుగులోను ఈ ఇద్దరికీ మంచి మార్కెట్ వుంది. తమిళంతో పాటుగా తెలుగులోనూ వీళ్ల సినిమాలు విడుదలవుతుంటాయి. ప్రస్తుతం సూర్య 'సింగం 3' సినిమా చేస్తున్నాడు. ఇక కార్తీ 'కాష్మోరా' చేస్తున్నాడు .. రెండూ భారీ బడ్జెట్ సినిమాలే.

గతంలో సింగం 1 .. సింగం 2 సినిమాలతో సూర్య ఘనవిజయాలు అందుకున్నాడు. అందువలన సింగం 3 పై భారీ అంచనాలే వున్నాయి. ఇక 'కాష్మోరా' ఫస్టులుక్ బయటికి రావడంతో, ఈ సినిమాపై కూడా ఆడియన్స్ లో ఆసక్తి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు 'దీపావళి'కి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే, అన్నదమ్ములలో ఏ ఒక్కరూ పోటీ నుంచి తగ్గకుండా, 'రెండు సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేసేయండి' అంటూ అభిమానులను ఉత్సాహపరుస్తుండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)