ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sat, Aug 20, 2016
త్రిష
త్రిష
* తెలుగు, తమిళ టాప్ హీరోలందరి సరసన నటించిన చెన్నయ్ బ్యూటీ త్రిషకు ఒక కోరిక మిగిలిపోయిందట. అదేమిటంటే, రజనీకాంత్ పక్కన నటించాలనే కోరిక! ఇది తన చిరకాల కోరిక అనీ, ఆయనతో కలసి నటించే ఛాన్స్ ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తున్నానని ఈ చిన్నది అంటోంది.
* నారా రోహిత్ హీరోగా నటించిన 'శంకర' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. వచ్చే నెల 16న దీనిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రెజీనా కథానాయికగా నటించింది.
* విక్రం, నయనతార జంటగా తమిళంలో నటిస్తున్న 'ఇరుముగన్' చిత్రాన్ని 'ఇంకొక్కడు' పేరిట తెలుగులోకి అనువదిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను అభిషేక్ పిక్చర్స్ ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసి సొంతం చేసుకుంది.
* అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న 'ఇంట్లో దెయ్యం నాకేంటి భయం' చిత్రం చివరి షెడ్యూలు షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.74.94
Movie News (Latest)