ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సల్మాన్ కి తల్లి పాత్రలో శ్రీదేవి?

Fri, Aug 19, 2016
శ్రీదేవి
శ్రీదేవి
శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టగానే, ఇక ఆమె వరుస సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ పాత్రల ఎంపిక విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వెళుతోంది. ఆ మధ్య తమిళంలో 'పులి' సినిమా చేసిన ఆమె, ప్రస్తుతం 'మామ్' సినిమా చేస్తోంది. ఆ తరువాత ఆమె చేసే సినిమాలో సల్మాన్ ఖాన్ కి తల్లిగా కనిపించే అవకాశం ఉందనే వార్తలు బాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్నాయి.

రచయిత విపుల్ షా వినిపించిన కథ నచ్చడంతో, సల్మాన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది తల్లీ కొడుకుల అనుబంధానికి అద్దం పట్టే కథాంశంతో రూపొందే సినిమా. ఇందులో తల్లి పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటంతో, శ్రీదేవి అయితేనే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారు. ఆమె నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో వేచి చూడాలి మరి.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)