ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భారీ సినిమా ప్లాన్ చేస్తోన్న హీరో

Fri, Aug 19, 2016
సుదీప్
సుదీప్
కన్నడ కథానాయకుడిగా సుదీప్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన మంచి నటుడే కాదు .. దర్శకుడు కూడా. సింగం .. విక్రమార్కుడు .. మిర్చి రీమేక్ లను అక్కడ తెరకెక్కించింది ఆయనే. ప్రస్తుతం కథానాయకుడిగా ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు.

ఈ సినిమాలు పూర్తయిన తరువాత ఆయన ఒక భారీ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. 'బాహుబలి' తరహాలో వుండే ఒక భారీ సినిమాకి తాను దర్శకత్వం వహించనున్నానని అన్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని చెప్పాడు. తాను అంగీకరించిన ప్రాజెక్టులు పూర్తికాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందనీ .. వచ్చే ఏడాది ఆరంభంలో మొదలుకావొచ్చని అన్నాడు.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)