ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిరూ ఫస్టులుక్ ను ఖరారు చేసిన చరణ్

Fri, Aug 19, 2016
చిరంజీవి
చిరంజీవి
చిరంజీవి 150వ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు కావడం వలన, ఆ రోజున ఆయన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితం చెప్పారు. ఆ రోజున ఫస్టులుక్ రావడమనేది ఖాయమని తాజాగా చరణ్ తేల్చేశాడు. ఈ సినిమాకి 'కత్తిలాంటోడు' అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ ఆ టైటిల్ కాదని ఇటీవలే చరణ్ చెప్పాడు.

దాంతో టైటిల్ ఎలా వుండబోతోందనే ఆసక్తి కూడా అభిమానుల్లో వుంది. చిరంజీవి పుట్టినరోజున టైటిల్ తో పాటు ఫస్టులుక్ ను రిలీజ్ చేస్తారు కనుక, అందరి దృష్టి ఆ తేదీ పైనే ఉంటుందని చెప్పొచ్చు. వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా కాజల్ కనిపించనున్న సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)