ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మాస్ పాత్రలే చేస్తానంటున్న నాయిక

Fri, Aug 19, 2016
త్రిష
త్రిష
చెన్నయ్ చిన్నది త్రిషకు బోర్ కొట్టేసిందట. అందుకే, ఆ తరహా చిత్రాలు ప్రస్తుతం చేయనని అమ్మడు దర్శక నిర్మాతలకు చెబుతోంది. గత దశాబ్దంన్నరగా తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా రాణిస్తున్న త్రిషకు, ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ పోటీ అన్నది మాత్రం లేదు. ఆమెకు వచ్చే అవకాశాలు ఆమెకు వస్తూనే వున్నాయి. అందుకే, ఇప్పటికీ బిజీ నాయికగా కొనసాగుతోంది. అయితే, ఇటీవలి కాలంలో ఈ ముద్దుగుమ్మ వరుసగా 'కళావతి', 'మోహిని', 'నాయకి' వంటి కొన్ని హారర్ సినిమాలు చేసింది. వాటికి ప్రేక్షకాదరణ కూడా లభించింది. దీంతో అలాంటి సినిమాలలో నటించమంటూ దర్శక నిర్మాతల నుంచి ఆమెకు ఆఫర్లు వస్తున్నాయట. అయితే, ఇలా వరుసగా ఒకే తరహా సినిమాలు చేస్తే ప్రేక్షకులకు, తనకు కూడా బోర్ కొట్టేస్తుందని, అందుకే వాటికి బ్రేక్ ఇస్తున్నానని చెప్పింది. ప్రస్తుతం కమర్షియల్ నినిమాలలో మాస్ మసాలా పాత్రలు పోషిస్తానని చెబుతోంది. మరి, దర్శక నిర్మాతలు ఇస్తారేమో చూద్దాం!
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)