ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Fri, Aug 19, 2016
మిస్తి చక్రబర్తి
మిస్తి చక్రబర్తి
* 'చిన్నదాన నీ కోసం' ఫేం మిస్తి చక్రబర్తి తాజాగా మరో తెలుగు చిత్రానికి ఓకే చెప్పింది. అవసరాల శ్రీనివాస్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తుంది. హిందీలో వచ్చిన 'హంటర్' చిత్రం ఆధారంగా ఇది రూపొందుతోంది.
* తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రం సూపర్ హిట్టయిన నేపథ్యంలో ఈ చిత్రం రీమేక్ హక్కుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఇప్పటికే దీనిని హిందీలోకి సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తుండగా, తమిళంలో నిర్మించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. పలువురు నిర్మాతలు తమిళ రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు.
* రజనీకాంత్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న 'రోబో 2.0' చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించి రజనీ, అక్షయ్ కుమార్ ల ఫస్ట్ లుక్ ను నవంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్రం యూనిట్ తెలిపింది. దానితో పాటుగా టీజర్ ను కూడా విడుదల చేస్తామన్నారు.
* 'కళ్యాణ వైభోగమే' హిట్ తర్వాత నందినిరెడ్డి మరో చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో 'పెళ్లి చూపులు' ఫేం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తాడట. మాళవిక నాయర్ హీరోయిన్ పాత్రకు ఎంపికైంది.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)