ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీకి సన్నాహాలు

Thu, Aug 18, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
ఎన్టీఆర్ తాజా చిత్రం 'జనతా గ్యారేజ్' వచ్చేనెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. దాంతో తదుపరి సినిమా షూటింగ్ కి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ .. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు కొంతకాలం క్రితమే వార్తలు వచ్చాయి.

ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలను వక్కంతం వంశీ మొదలుపెట్టేశాడనేది తాజా సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ప్రస్తుతం నటీనటులు .. సాంకేతిక నిపుణుల ఎంపికపై దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాను, అక్టోబర్ నుంచి మొదలుపెట్టే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)