ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హారర్ థ్రిల్లర్ గా వస్తోన్న 'ఎవరు?'

Thu, Aug 18, 2016
తారకరత్న
తారకరత్న
ఒక వైపున కథానాయకుడిగాను .. అవకాశం దొరికితే ప్రతినాయకుడిగాను నటిస్తూ, నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి తారకరత్న ప్రయత్నిస్తూనే వున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన 'ఎవరు' అనే హారర్ థ్రిల్లర్ చేశాడు. రమణ సెల్వా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, తారకరత్న ఓ సైకియాట్రిస్ట్ తరహా పాత్రను పోషించాడు.

ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రోజున ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ నారా రోహిత్ చేతుల మీదుగా విడుదలైంది. ప్రస్తుతం హారర్ థ్రిల్లర్ చిత్రాల జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా, తారకరత్నకు విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)