ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'మిస్టర్' రిజల్ట్ ను బట్టే ఆ మూవీ వుంటుందట!

Thu, Aug 18, 2016
శ్రీను వైట్ల
శ్రీను వైట్ల
దర్శకుడు శ్రీను వైట్ల ప్రస్తుతం 'మిస్టర్' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఆయన స్పెయిన్ లో చిత్రీకరిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన రామ్ హీరోగా ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు. అందుకు సంబంధించిన కథను కూడా ఆయన ఆల్రెడీ సిద్ధం చేశాడట.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'రెడీ' .. ఘన విజయాన్ని నమోదు చేసింది. అందువలన మరోసారి రామ్ తో చేయడానికి శ్రీను వైట్ల ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఈ సినిమాను నిర్మించే ఆలోచనలో పెద్ద నిర్మాణ సంస్థ ఉందట. అయితే 'మిస్టర్' సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూసుకునే రంగంలోకి దిగాలని నిర్ణయించుకుందని అంటున్నారు. మరి 'మిస్టర్'తో శ్రీను వైట్ల హిట్ కొడతాడేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)