ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆసక్తిని రేపుతోన్న 'కాష్మోరా' ఫస్టులుక్!

Thu, Aug 18, 2016
కార్తీ కథానాయకుడిగా తమిళంలో 'కాష్మోరా' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఫస్టు లుక్ ను కార్తీ రిలీజ్ చేశాడు. యుద్ధంలో నేల కొరిగిన శత్రువుల మధ్యలో, విజయ గర్వంతో అరుస్తూ ఒక యోధుడిలా కార్తీ కనిపిస్తున్నాడు. గుండుతో .. గుబురు గడ్డంతో చిత్రమైన గెటప్ లో ఆయన ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఆయన చేతిలోని మంత్రదండంపై .. వస్త్రాలపై .. చివరికి టైటిల్ పై కూడా చిహ్నంగా 'గద్ద' కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే .. సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిలా ఈ ఫస్టులుక్ వుంది. గోకుల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నయనతార .. శ్రీదివ్య కథానాయికలుగా అలరించనున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. పీవీపీ బ్యానర్ వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురానున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)