ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ కొత్త సినిమా మొదలయ్యేది అప్పుడే!

Thu, Aug 18, 2016
చరణ్
చరణ్
ప్రస్తుతం చరణ్ 'ధ్రువ' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను అక్టోబర్ 7న విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు సుకుమార్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.

'ధ్రువ' సినిమా రిలీజ్ కాగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని అనుకున్నారు. అయితే 'ధ్రువ' లుక్ లో నుంచి చరణ్ మరో కొత్త లుక్ కి మారవలసి వుంది. అందువలన మరికాస్త సమయం తీసుకుని, ఈ సినిమాను నవంబర్ లో మొదలుపెట్టాలనే నిర్ణయానికి వచ్చారట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాలో, కథానాయికగా కొత్త అమ్మాయిని తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)