ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ముద్దుగుమ్మ అంచనా తప్పిందట!

Thu, Aug 18, 2016
ఇలియానా
ఇలియానా
సినిమాల ఎంపిక విషయంలో హీరో హీరోయిన్ల అంచనాలు ఒక్కోసారి తప్పుతుంటాయి. 'ఇది ఆడదు' అని ఫిక్సయిన సినిమా సూపర్ హిట్టవుతుంది. 'కచ్చితంగా ఆడుతుంది' అని బాగా నమ్మిన సినిమా అట్టర్ ఫ్లాపవుతుంది. గోవా బ్యూటీ ఇలియానాకు కూడా ఆమధ్య అలాగే జరిగిందట. 'హ్యాపీ ఎండింగ్' సినిమా తర్వాత తనను వెతుక్కుంటూ వచ్చిన ఓ బాలీవుడ్ ఆఫర్ ను అమ్మడు తిరస్కరించింది. తీరా చూస్తే అది సూపర్ హిట్టయి కూర్చుంది. ఈ విషయాన్ని తనే తాజాగా వెల్లడించింది.

"ఓ నిర్మాత వచ్చి తన సినిమా చేయమని అడిగారు. కథ విన్నాను. కథతో పాటు హీరోయిన్ పాత్ర కూడా నచ్చింది. అయితే, అంతలోనే... 'ఇది ఆడదేమో' అన్న చిన్న డౌటు వచ్చింది. దాంతో సమయం వృథా అవుతుందని ఆ ఆఫర్ ని రిజక్ట్ చేశాను. అక్కడికీ ఆ నిర్మాత చెబుతూనే వున్నాడు, 'ఇది మీకు మంచి పేరు తెస్తుంది' అంటూ. అలాంటి మాటలు ఇక్కడ మామూలే కదా అని లైట్ తీసుకుని, ఒప్పుకోలేదు. పైపెచ్చు, ఆ పాత్రకి నేనే మరో హీరోయిన్ పేరు సజెస్ట్ చేశాను. తీరా చూస్తే అది సూపర్ హిట్. అందుకు నేనేమీ బాధపడలేదు లెండి. మనకు రాసిపెట్టి ఉన్నదే మనకు వస్తుంది" అని చెప్పింది ఇల్లీ బ్యూటీ. అయితే, ఆ సినిమా పేరు మాత్రం ఈ చిన్నది చెప్పలేదు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)